శ్రద్ధావాకర్ హత్య తరహాలోనే..మహిళా శరీర భాగాలు కట్‌ చేసి !

Home >>> క్రైమ్ > శ్రద్ధావాకర్ హత్య తరహాలోనే..మహిళా శరీర భాగాలు కట్‌ చేసి !

news-details

ఢిల్లీలో మరో దారుణం జరిగింది. కాల్ సెంటర్ ఉద్యోగిని శ్రద్ధవాకర్ హత్య తరహాలోనే ఢిల్లీలో మరో దారుణం జరిగింది. రెండు వేరువేరు ప్రాంతాల్లో కవర్లలో చుట్టిపడేసిన మహిళా శరీర భాగాలు దొరికినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. ఉత్తర ఢిల్లీలోని యమునా ఖాదర్ ప్రాంతం గీతా కాలనీ ఫ్లైఓవర్ సమీపంలో మహిళా శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు.

వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఆమె వయసు 35-40మధ్య ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించినట్టు పోలీస్ కమిషనర్ సాగర సింగ్ కల్సి తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఢిల్లీలో ఒకదాని తర్వాత మరొకటి మహిళల దారుణ హత్యలు ఎందుకు జరుగుతున్నాయంటూ పోలీసులకు నోటీసులు పంపారు.

You can share this post!