Home >>> సినిమా > మిస్టర్ బచ్చన్ ట్రైలర్ కు ఫ్యాన్స్ ఫిదా...!
మాస్ మహారాజా హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్. ఆగస్ట్ 15 సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ ను కాసేపటి క్రితం విడుదల చేసింది చిత్ర యూనిట్. సరిహద్దు కాపాడే వాడే కాదు సంపద కాపాడే వాడు కూడా సైనికుడే అంటూ ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ ప్రాధాన్యతను చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. రవితేజా మాస్ డైలాగ్ లను పవర్ ఫుల్ గా చెప్పించాడు. గత సినిమాల కంటే భిన్నంగా రవితేజ ను చూపించాడు.
జగపతి బాబు ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. అరవింద సమేత తరహాలో జగ్గు భాయ్ ని కాస్త భిన్నంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ ఫుల్లో ఇన్కంటాక్స్ కూడా అంతే పవర్ ఫుల్ అంటూ రవితేజా పవర్ ఫుల్ డైలాగ్ చెప్పాడు. సినిమాలో యాక్షన్ సీన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అనేది దర్శకుడు ట్రైలర్ లోనే హింట్ ఇచ్చేసాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తోంది.