వచ్చేస్తుంది.. వచ్చేస్తుంది.. భారత్‌కు టెస్లా వచ్చేస్తుంది..

Home >>> అంతర్జాతీయం > వచ్చేస్తుంది.. వచ్చేస్తుంది.. భారత్‌కు టెస్లా వచ్చేస్తుంది..

news-details

ఇండియాలోకి వీలైనంత త్వరగా అడుగుపెట్టేందుకు ఈవీ కార్ల కింగ్ టెస్లా కంపెనీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దేశంలో కార్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు  కేంద్ర ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించినట్లు జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ మీడియాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా 5 లక్షల వాహనాలను తయారు చేసే సామర్ధ్యం గల ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఎలాన్ మస్క్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేసే కార్లను ఫసిఫిక్ ప్రాంతాలకు ఎగుమతి చేయాలని టెస్లా కంపెనీ భావిస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంలో విశ్వసనీయ వర్గాలు చెబుతున్నట్లు సమాచారం. ఇక భారత్‌లో విద్యుత్ వాహనాల ధర ప్రారంభ ధర రూ.20 లక్షల నుంచి ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే టెస్లా కంపెనీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.

అమెరికాలో మోడీతో భేటీ అయిన ఎలన్ మస్క్

గత నెలలో ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్‌తో ప్రధాని భేటీ అయ్యారు. ఆ తర్వాత మస్క్ మాట్లాడుతూ.. భారత్‌లో టెస్లా కార్యకలాపాలు త్వరలో ప్రారంభమవుతాయని.. త్వరలో ప్రకటన ఉంటుందని వెల్లడించారు. ఈ భేటీ తర్వాత టెస్లా కంపెనీ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పాటు.. పలువురు అధికారులతో చర్చలు మొదలు పెట్టినట్లు సమాచారం. అయితే గత కొన్నేళ్లుగా భారత్‌లో టెస్లా వస్తుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే భారత్‌లోకి దిగుమతి చేసుకునే కార్లపై ప్రభుత్వం భారీ ఎత్తున ట్యాక్సులు విధిస్తోంది. దీంతో ఎలాన్ మస్క్ ట్యాక్సులు తగ్గించాలని కేంద్రాన్ని కోరారు. తర్వాత విక్రయాల తీరును బట్టి స్థానికంగా తయారీపై ఆలోచిస్తామని తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. అయితే మొన్న మోడీ అమెరికా పర్యటన సందర్భంగా కేంద్ర బృందం.. టెస్లా కంపెనీకి పలు కీలక సూచనలు చేసింది. భారత్‌లో సంస్థను నెలకోల్పడం ద్వారా ఖర్చు తగ్గుతుందని.. అంతే కాకుండా విడిభాగాలుగా తీసుకొచ్చి ఇండియాలో అసెంబుల్ చేసే విధానం గురించి దృష్టి సారించాలన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన గురించి టెస్లా కంపెనీ ఆలోచన చేసిందని.. త్వరలో ఇండియాలో కార్ల తయారీ గురించి కీలక ప్రకటన ఉంటుందని ఇటు కేంద్ర పెద్దలు.. అటు టెస్లా కంపెనీ నుంచి గుసగుసల వినిపిస్తున్నాయి.

You can share this post!