Home >>> క్రీడలు > రెండు చేతులతో బౌలింగ్ వేసిన శ్రీలంక బౌలర్... ఐసీసీ రూల్స్ ఏమంటున్నాయి...?
సాధారణంగా బౌలింగ్ లో మనం వైవిధ్యం చూస్తూ ఉంటాం. బ్యాట్స్మెన్ ఫుట్ వర్క్ లేదా అతని బ్యాటింగ్ స్టైల్ ని బట్టి బౌలింగ్ చేస్తూ ఉంటారు. దూస్రా, ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్, యార్కర్, స్లో బాల్స్ ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా... కాని అంతర్జాతీయ క్రికెట్ లో ఒక బౌలర్ రెండు చేతులతో బౌలింగ్ చేయడం ఎప్పుడైనా చూసారా...? శనివారం రాత్రి జరిగిన శ్రీలంక భారత్ మ్యాచ్ లో ఈ సన్నివేశం చోటు చేసుకుంది.
శ్రీలంక బౌలర్ కమిందు మెండిస్ బౌలింగ్ కు వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు. సూర్యకుమార్ యాదవ్కు ఎడమ చేతితో బౌలింగ్ చేసాడు మెండిస్. ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండర్ అయిన రిషబ్ పంత్కు చేయి మార్చి కుడి చేత్తో బౌలింగ్ వేయడంతో అందరూ షాక్ అయ్యారు. సరదాకు వేయలేదు అతను. బ్యాట్స్మెన్ దూకుడుని కట్టడి చేసేందుకు ఆ విధంగా ప్రయత్నం చేసాడు.
అసలు ఐసీసీ నిబంధనలు ఏం చెప్తున్నాయనేది చూద్దాం. 21.1.1 ప్రకారం.. బౌలర్ కుడి చేతితో బౌలింగ్ చేస్తున్నాడా లేదా ఎడమ చేత్తోనా అనేది అంపైర్ కు చెప్తే ఆ తర్వాత అంపైర్ బ్యాట్స్మెన్ కు చెప్తాడు. ఆ తర్వాత ఓవర్ ది వికెట్ లేదా రౌండ్ ది వికెట్ కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇలా చెప్తే వెంటనే బ్యాట్స్మెన్ కు చెప్పాల్సి ఉంటుంది. చెప్పకపోతే అది నో బాల్ అవుతుంది. మెండిస్ చెప్పాడు కాబట్టి అది నో బాల్ కాదు.