వినేష్ గుడ్ బై: అమ్మ.. క్షమించు.. గెలవలేక పోయాను..!

Home >>> క్రీడలు > వినేష్ గుడ్ బై: అమ్మ.. క్షమించు.. గెలవలేక పోయాను..!

news-details

ఒలంపిక్స్ పోటీల నుంచి అనూహ్య రీతిలో అనర్హతకు గురైన వినేష్ ఫోగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కుస్తీ కెరీర్ కు గుడ్ బై చెప్పాలని ఆమె నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనం అయింది. నేను కుస్తీలో గెలిచాను, కానీ కుస్తిపై పోరాటంలో ఓడిపోయాను, క్షమించండి, మీ కల, నా ధైర్యం అంతా భగ్నమైంది అని ఆమె ఎక్స్ లో పోస్ట్ చేసింది. అలాగే ఇంతకంటే బలం నాకు లేదని... కుస్తీకి వీడ్కోలు పలుకుతున్నానని... 2001-2024 పేర్కొంది. 

 

మీ అందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను, క్షమించండి అంటూ ఎక్స్ లో విజ్ఞప్తి చేసింది. కాగా వంద గ్రాముల బరువు ఎక్కువ ఉందనే కారణంతో ఆమెను ఫైనల్ పోటీలకు ముందు అనర్హురాలిగా ప్రకటించారు. అందరూ భారత్ కు కుస్తీ పోటీల్లో గోల్డ్ మెడల్ ఖాయం అనుకున్న తరుణంలో ఆమె అనర్హతకు గురి కావడం ఆశ్చర్య పరిచింది. దేశ వ్యాప్తంగా ఆమెపై ప్రసంశల వర్షం కురుస్తోంది.

You can share this post!