హరీష్ ఏట్లో దూకిసావు

Home >>> తెలంగాణ > హరీష్ ఏట్లో దూకిసావు

news-details

ఖమ్మం జిల్లా పర్యటనలో సిఎం రేవంత్ రెడ్డి... మాజీ మంత్రి హరీష్ రావు లక్ష్యంగా ఘాటైన విమర్శలు చేసారు. 2 లక్షల రుణ మాఫీ కార్యక్రమానికి వైరా వేదిక అయ్యింది అన్నారు ఆయన. ఈ ఖమ్మం గడ్డ...కాంగ్రెస్ కు అడ్డా అని నిరూపించిన మీ అందరికీ ధన్యవాదాలు అంటూ రేవంత్ పేర్కొన్నారు. మే 6 2022 నాడు... వరంగల్ గడ్డ మీద రైతు రుణ మాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు అని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని 08 నెలల్లో 31 వేల కోట్ల తో రుణ మాఫీ చేసి రైతులకు రుణ విముక్తి కలిగించింది అన్నారు రేవంత్. 

భద్రాద్రి రాముని సాక్షిగా రైతాంగానికి రుణ మాఫీ చేస్తామని ఖమ్మం గడ్డ పై మాట ఇచ్చాను అని ఆయన స్పష్టం చేసారు. మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు సోనియా గాంధీ అని కొనియాడారు. ఆమె వారసుడు వరంగల్ గడ్డ పై రైతు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు అని రాహుల్ గాంధీ మాట నెరవేర్చేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కృషి చేశారు అని ప్రసంశల వర్షం కురిపించారు. హరీష్ రావు పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ రేవంత్ రెడ్డి... హరీష్ రావు సిగ్గు లజ్జ ఉంటే...రాజీనామా చెయ్యి అని సవాల్ చేసారు. లేకుంటే ఏటిలో దూకి చావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. హరీష్ రావు కు సవాల్ విసురుతున్న....నీకు సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి అంటూ రేవంత్ దుమ్మెత్తిపోశారు.

You can share this post!