కవితకు సుప్రీం కోర్ట్ షరతులతో కూడిన బెయిల్...

Home >>> తెలంగాణ > కవితకు సుప్రీం కోర్ట్ షరతులతో కూడిన బెయిల్...

news-details

2022 లో వెలుగులోకి వచ్చిన లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత నిందితురాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చ్ లో ఆమెను దర్యాప్తు సంస్థల అధికారులు అదుపులోకి తీసుకుని తీహార్ జైలుకి తరలించారు. అప్పటి నుంచి కవిత బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా సరే ఆమెకు బెయిల్ రాలేదు. పలు మార్లు విచారించిన అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇక నేడు సుప్రీం కోర్ట్ ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఆర్డర్ లో కీలక అంశాలు ప్రస్తావించింది. 

పాస్ పోర్ట్ సబ్మిట్ చేయాలి అని స్పష్టం చేసింది. కవిత రెండు కేసుల్లో బెయిల్ పొందడంతో... ఒక్కో కేసుకి పది లక్షల చొప్పున మొత్తం 20 లక్షలు కోర్ట్ కి సమర్పించాల్సి ఉంటుంది. దేశం విడిచి పోవాలి అంటె పర్మిషన్ తీసుకుని వెళ్లాలి. అదే విధంగా కేసు ట్రయల్ కు సహకరించాలని సుప్రీం కోర్ట్ ఆదేశించింది. విచారణ వాయిదాల సమయం లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కి సహకరించాలని పేర్కొంది. నేడు సాయంత్రం 5 గంటల లోపు కవితకు బెయిల్ పై విడుదల కానున్నారు.

You can share this post!